విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
హాలియా : చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి భీమ్‌సింగ్ సూచించారు. హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పేస్ రికగ్నిషన్ సిస్టమ్‌లో విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పారు. హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి నుంచి తగిన కారణాలతో కూడిన ఉత్తరాలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ నుంచి ప్రతి కళాశాలకు డిజిటల్ బోర్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాఖీర్ హుస్సేన్, అధ్యాపకులు ఆదిరెడ్డి, బాలరాజు, వెంకట్‌నాయక్, హరికృష్ణ, సంజీవరెడ్డి, లింగమూర్తి తదితరులు ఉన్నారు.
నాగార్జునసాగర్‌లో..
విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి జాయింట్ సెక్రటరీ భీమ్‌సింగ్ సూచించారు. మంగళవారం నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థుల నివాసాలను సందర్శించి తల్లిదండ్రుకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసరి రాజశేఖర్, అధ్యాపకులు చింతపల్లి వెంకటయ్య, ప్రసన్నలక్ష్మి, బంగారు ఉపేంద్రాచారి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


