2 వరకు విద్యుత్ విజిలెన్ వారోత్సవాలు
నల్లగొండ: జిల్లా కేంద్రలోని కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యుత్ విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచి నవంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏసీపీ మౌనిక, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, బి. ప్రతాప్‌కుమార్, విద్యుత్ అధికారులు కె. ఇందిర, ఎస్.కె. గౌస్, ఎస్.నాగరాజుయాదవ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


