వైద్యులు సమయపాలన పాటించాలి
దేవరకొండ : ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. అనంతరం రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవి, వైద్యులు రాజేష్, వైద్య సిబ్బంది ఎస్తేర్ రాణి, రమేష్, శరత్ తదితరులున్నారు.
కపాస్ కిసాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
తిప్పర్తి : పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి అన్నారు. మంగళవారం తిప్పర్తి మార్కెట్ యార్డులో ఆ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి అమ్ముకోడానికి ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో వివరించారు. బుక్ చేసిన స్లాట్ వివరాలను ఈయాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఆమె వెంట ఏఓ సన్నిరాజు, ఏఈఓ సంతోషి తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ మహాసభ మంగళవారం నల్లగొండ పట్టణంలోని యూటీఎఫ్ భవన్‌లో జరిగింది. ఈ మహాసభలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగా అరుణ సమక్షంలో నల్లగొండ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డివిజన్ గౌరవాధ్యక్షుడిగా చిట్టిపోలు భిక్షమయ్య, అధ్యక్షుడిగా గుండాల భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శిగా చేపూరి పరశురాములు, ఉపాధ్యక్షులుగా కొమ్మారెడ్డి రాయపురెడ్డి, ఏశాల జయలక్ష్మి, సామ అంజిరెడ్డి, కోశాధికారిగా రాపోలు వెంకటేశం, కార్యదర్శులుగా సావిత్రి పటాలే, పెండెం విజయకుమారి, మౌలానా అస్కర్, రచ్చ సూర్యనారాయణ, ఆడిట్ కన్వీనర్‌గా వనమా నరసింహ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూకల జగదీష్‌చంద్ర, పందిరి శ్యాంసుందర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ఎండి.అబ్దుల్‌ఖాదర్, వనం శ్రీవాణి, రమేష్, కె.రాఫెల్, వై.సత్తయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
1న దళితుల ఆత్మగౌరవ ర్యాలీ
నల్లగొండ: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి జరిగితే ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 1 న ఛలో హైదరాబాద్ పేరుతో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ తెలిపారు. నల్లగొండలోని ప్రభుత్వ కేపీఎం జూనియర్ కళాశాలలో మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్ గవాయ్‌పై దాడి ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జితో విచారణ చేయించాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మలపాక వెంకన్న, జిల్లా నరసింహ, సాయి కిరణ్ గోపీచంద్, నరేష్, మురళి స్వామి, అన్నపూర్ణ, శైలజ, వాణి, శ్రీలత పాల్గొన్నారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
వైద్యులు సమయపాలన పాటించాలి
వైద్యులు సమయపాలన పాటించాలి


