యాదగిరి క్షేత్రానికి ‘మోంథా’ ఎఫెక్ట్
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మోంథా తుపాన్ కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బుధవారం స్వామివారి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు భక్తులు తక్కువగా కనిపించారు. ఆరు బ్యాచ్‌లుగా సత్యనారాయణస్వామి వ్రత పూజలను 114 జంటలు నిర్వహించాయి. వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.9,17,614 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
తుపాన్ కారణంగా తగ్గిన భక్తులు


