క్యాంపస్ ఇంటర్వ్యూలకు స్పందన
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు అపూర్వ స్పందన లభించిందని ఎంజీయూ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి అన్నారు. బుధవారం ఎంజీ యూనివర్సిటీలో ప్రాంక్లిన్ టెక్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ సహకారంతో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు 220 మంది అభ్యర్థులుగా హాజరైనట్లు వెల్లడించారు. వారిలో 70 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు శేఖర్, సత్యనారాయణరెడ్డి, వెంకట్, ఫ్రాంక్లిన్‌టెక్ సీఈఓ ఆర్.శివకుమార్, కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు వేణు, ప్రతాప్, దివ్య, పృథ్వీ, శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


