
రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలి
రామగిరి(నల్లగొండ) : బీసీ రిజర్వేషన్ల అమలుకు రాజకీయ పార్టీలు చిత్తశుద్ధీతో పనిచేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పన్నాల గోపాల్‌రెడ్డి, గుండెబోయిన నాగేశ్వరరావుయాదవ్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన సబ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై జీఓ 9కి మద్దతుగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైకోర్టులో ఇంప్లిడ్ పిటిషన్ వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం కాకుండా బీసీల ఆశయాల కోసం పనిచేయాలని కోరారు. సమావేశంలో నాయకులు తోట నరసింహాచారి, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.క్రాంతి కుమార్, కిరణ్, జగన్నాథం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.