
నేడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభ
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభను తుంగతుర్తి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంతర్‌రెడ్డి హాజరవుతున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని శనివారం ఎస్పీ పరిశీలించారు. అనంతరం దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డితో కలిసి సంతాప సభ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీఓ వేణుమాధవ్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ తుంగతుర్తికి రానున్న
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి