యాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్‌

Oct 12 2025 6:37 AM | Updated on Oct 12 2025 6:37 AM

యాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్‌

యాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్‌

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఇన్‌చార్జి ఈఓ రవినాయక్‌ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు.

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

చౌటుప్పల్‌ రూరల్‌: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ గ్రామంలో శని వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీపల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పులనగారి వెంకటేశం(55) రోజుమాదిరిగానే శనివారం కూడా కల్లు గీసేందుకు గ్రామ పరిధిలోని తాటిచెట్టు ఎక్కుతుండగా.. కాలు జారి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు గమనించి పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశం మృతదేహాన్ని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశం కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రాగీరు కిష్టయ్య కోరారు.

చికిత్స పొందుతూ..

తుంగతుర్తి : తాటిచెట్టుపై నుంచి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గీత కార్మికుడు శనివారం మృతిచెందాడు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గూడ వెంకన్న(48) ఈ ఏడాది మే నెలలో ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన వెంకన్న.. శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

వ్యభిచార గృహంపై

పోలీసుల దాడి

మిర్యాలగూడ అర్బన్‌: వ్యభిచార గృహంపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ వన్‌టౌన్‌ ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న రమావత్‌ విజయ, ఆమె కుమారుడు రమావత్‌ వినోద్‌రాథోడ్‌ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి మహిళను, విటుడిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఒక యాక్టీవా వాహనం, బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement