
ఆహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి
గరిడేపల్లి: ఆహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందు కోసం రైతులకు ఉపయోగపడేలా అనేక పథకాలను, సబ్సిడీలను అందిస్తుందని నాబార్డ్ డీడీఎం డి. రవీందర్‌నాయక్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చడం, రైతులకు సులభతర రుణాల కల్పన మొదలైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంతో పాటు పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ను శనివారం ప్రారంభించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి నాబార్డ్ డీడీఎం రవీందర్‌నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కూడా ఒకే పంటపై ఆధారపకుండా కూరగాయలు, పండ్ల మొక్కలు, పెరటి కోళ్లు, పశువులు, చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డివిజన్ ఏడీఏ రమేష్‌బాబు, హుజూర్‌నగర్ ఏడీఏ రవినాయక్, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డి. నరేష్, కేవీకే శాస్త్రవేత్తలు డి. నరేష్, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, ఎన్. సుగంధి, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎ. నరేష్, వెటర్నరీ ఆఫీసర్ ఈ. కిరణ్, మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్‌కుమార్, సందీప్, అనిల్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇప్కో కంపెనీ ఏరియా మేనేజర్ వెంకటేశ్వర్లు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సూర్యాపేటటౌన్: బైక్‌ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామానికి చెందిన వంటిపులి నర్సింహరావు(40) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధాకర్ పీవీసీ కంపెనీలో పనిచేస్తూ కుడకుడలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శనివారం ఉదయం బైక్‌పై కంపెనీకి వెళ్తుండగా కొత్త వ్యవసాయ మార్కెట్ క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగానే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సింహరావు బైక్‌ను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య మైసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్టు పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు.
ఫ నాబార్డ్ డీడీఎం రవీందర్‌నాయక్