
సాగర్ బీసీ గురుకులంలో మెడికల్ క్యాంపు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం 25వ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి, గురుకుల విద్యాలయాల సెక్రటరీ బి. సైదులు హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తాను చదువుకున్న పాఠశాల కావడంతో సైదులు తన గురువులను, స్నేహితులను, జూనియర్లను కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. మెడికల్ క్యాంపులో పాల్గొన్న వైద్యుల సేవలను అభినందించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యాస స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బోధనానోపకరణాలు ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా కృషి చేయాలని ఆర్‌సీఓ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్‌కు సూచించారు. సాగర్‌లో డిగ్రీ కళాశాల కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు నిడమనూరులో తాత్కాలికంగా తరగతులు కొనసాగించి, అనంతరం ఇక్కడకు మారస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, చిట్ల చక్రపాణి, శివాజీ, సైదులు, కొత్తపల్లి నితీష్, సరిత, హెల్త్ సూపర్‌వైజర్ రజిని, పీఈటీ నర్సింహ, పీడీ అరుణజ్యోతి, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ హాజరైన పూర్వ విద్యార్థి,
గురుకుల విద్యాలయాల సెక్రటరీ సైదులు