
మద్దతు ధర పొందాలి
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: నాణ్యతాప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర క్వింటాకు రూ.2,389 పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం ఆమె నల్లగొండ మండలం అర్జాలబావి, నకిరేకల్ మండలం తాటికల్‌లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తాలు, మట్టిపెడ్డలు లేకుండా ధాన్యాన్ని తేవాలన్నారు. ఆమె వెంట డీసీఓ పత్యానాయక్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, నకిరేకల్ తహసీల్దార్ యాదగిరి, ఏడీఏ జానిమియా, పీఏసీఎస్ సీఈఓ జగన్‌రెడ్డి ఉన్నారు.