
చెర్వుగట్టు ఆదాయం రూ.40.46 లక్షలు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీలను శుక్రవారం లెక్కించారు. 85 రోజులకు సంబంధించి రూ.40,46,640 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్‌కుమార్ తెలిపారు. అలాగే అన్నదానం కార్యక్రమానికి భక్తులు సమర్పించిన హుండీని లెక్కించగా రూ.50,844 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో నల్లగొండ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజ్యలక్ష్మి, నరేష్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.