
దుర్గాదేవి ఉత్సవాల లక్కీడ్రా విజేతకు ప్లాట్ రిజిస్ట్రే
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలంలోని గౌస్‌కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గాకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీ శరన్నవ రాత్రోత్సవాలను పురస్కరించుకొని లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ నెల 3న నిర్వహించిన డ్రాలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రూపాని రాజుకు 150 గజాల ప్లాట్ వరించింది. దాంతో గురువారం ఆ విజేతకు చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో 150 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేసి నిర్వాకులు డాక్యుమెంట్స్ అందజేశారు. ఈసందర్భంగా రాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశివరామ దుర్గాకమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రమోద్‌రెడ్డి, వెదిరె రాజిరెడ్డి, మర్రి నితిన్‌రెడ్డి, కళ్లెం రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.