ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి

Oct 10 2025 5:54 AM | Updated on Oct 10 2025 5:54 AM

ప్రభు

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి

నల్లగొండ: ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లోని రైతులు తమ ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. వానాకాలం సీజన్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వివిధ విభాగాల సిబ్బందికి గురువారం నల్లగొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు ధాన్యం పోసిన వెంటనే వారి పేరు, సీరియల్‌ బుక్‌లో రిజిస్టర్‌ చేసి వారికి సీరియల్‌ నంబర్‌ ఇవ్వాలన్నారు. రైతుల నుంచి పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌లు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం తెచిచ గ్రేడ్‌–ఏకు రూ.2,389, సాధారణ గ్రేడ్‌కు రూ.2369, సన్న ధాన్యానికి అదనంగా రూ.500 పొందాలన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు 32 క్వింటాళ్ల వరి ధాన్యం మాత్రమే కొనాలన్నారు. హమాలీ చార్జి ప్రభుత్వ ధర ప్రకారం క్వింటాకు రూ.45 మాత్రమే రైతుల నుంచి ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రవణ్‌కుమార్‌, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, వీరయ్య, బి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

సంతకాల సేకరణ విజయవంతం చేయాలి

నల్లగొండ: బీజేపీ చేస్తున్న ఓటు చోర్‌పై చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలోని 31వ వార్డులో ఓటు చోర్‌పై పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గురి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా బీజేపీ ఓట్‌ చోర్‌కు పాల్పడిందని విమర్శించారు. ఈనెల 15 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మనిమద్దె సుమన్‌, పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

కనగల్‌: మండల కేంద్రంలోని అక్కినపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్‌ ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న ఆవుల వైష్ణవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ థామసయ్య గురువారం మాట్లాడుతూ ఈ నెల 8న భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మహబూబాబాద్‌, నర్సంపేటలో జరిగే రాష్ట్రస్థాయి అండర్‌–19 కబడ్డీ పోటీల్లో పాల్గొననుందని పేర్కొన్నారు.

గరిష్టస్థాయి వద్ద నిలకడగా సాగర్‌ నీటిమట్టం

నాగార్జునసాగర్‌: సాగర్‌ జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్‌ జలాశయానికి 83,775 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 34,063 క్యూసెక్కులు మొత్తం 66,463 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వలకు 17,317 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు నీటిని నిలిపివేశారు. సాగర్‌ జలాశయం ప్రస్తుతం పూర్తిస్థా యి నీటిమట్టమైన 590 అడుగులు(312.0450 టీఎంసీల) వద్ద నిలకడగా ఉంది.

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి1
1/3

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి2
2/3

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి3
3/3

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement