
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఆరా
నల్లగొండ, రామగిరి(నల్లగొండ): నల్లగొండ కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమావేశమయ్యారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల నోటిఫికేషన్, నామినేషన్ల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కగా అమలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. అనంతరం ఆమె నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను జిల్లా కలెక్టర్ ఆమెకు వివరించారు. మొదటి విడతగా నల్లగొండ, దేవరకొండ డివిజన్లలోని 18 మండలాలు, 196 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు విధులను ప్రారంభించాయన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ ద్వారా భద్రతా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆమెకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రాజ్‌కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
కనగల్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని స్థానిక ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం వారు కనగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బందికి వారు పలు సూచనలు చేశారు. మొదటి రోజు జీ.యడవల్లి ఎంపీటీసీ స్థానానికి ఒక్కటే నామినేషన్ వచ్చిందని అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి కె.సుమలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారివెంట జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ కె.వెంకయ్య, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, నల్లగొండ ఆర్టీఓ వై.అశోక్‌రెడ్డి ఉన్నారు.
ఫ కలెక్టర్‌తో చర్చించిన స్థానిక ఎన్నికల జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి