
ఆకట్టుకున్న సైన్స్ డ్రామా పోటీలు
నల్లగొండ: నల్లగొండలోని డైట్ కళాశాలలో గురువారం నిర్వహించిన సైన్స్ డ్రామా పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను డీఈఓ భిక్షపతి ప్రారంభించి మాట్లాడుతూ సైన్స్ డ్రామాలు శాస్త్ర సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళతాయన్నారు. సైన్స్‌లో మహిళల పాత్ర, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, పరిశుభ్రత, గ్రీన్‌టెక్నాలజి అంశాలపై విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు ఆలోచింపజేశాయి. ఈ పోటీల్లో ఆర్పీ రోడ్డులోని ప్రభుత్వ బాలికల పాఠశాల నల్లగొండ ప్రథమ స్థానం, సెయింట్ ఆన్స్ హైస్కూల్ నకిరేకల్‌కు ద్వితీయ స్థానం, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈస్ బాలి కల స్కూల్ నకిరేకల్ 3వ స్థానం పొందాయి. విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వేణుగోపాల్, సాదియా పరహిన్, తస్లీమ్ ఫాతిమా, వనం లక్ష్మీపతి పాల్గొన్నారు.
బహుమతులు అందజేస్తున్న డీఈఓ భిక్షపతి
ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు

ఆకట్టుకున్న సైన్స్ డ్రామా పోటీలు