
ఆరు గ్యారంటీల పేరిట మోసం చేశారు
నకిరేకల్: ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలతో కూడిన బాకీ కార్డులను బుధవారం నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో ప్రజలకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ మర్చిపోయిన హమీలను గుర్తుచేయాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు బాకీ కార్డులను తీసుకొచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, నాయకులు సోమయాదగిరి, గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, గోర్ల వీరయ్య, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, దైద పరమేషం, యానాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య