
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
పెద్దఅడిశర్లపల్లి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఉపాధి హామీ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్‌లో నర్సరీని పరిశీలింశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆ తర్వాత తిరుమలగిరి(నాగార్జునసాగర్) మండలం అల్వాల గ్రామంలోని నర్సరీ పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటేందుకు ఐదుఫీట్ల పొడవు గల మొక్కలను వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచలను చేశారు. ఆయన వెంట పీఏపల్లి ఎంపీడీ చంద్రమౌళి, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం నాగలీల, ఈసీ దశరధరెడ్డి, తిరుమలగిరి సాగర్ మండల ఏపీఓ శ్రీను, ఏపీఎం రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సైదానాయక్, శ్రీరాములు ఉన్నారు.
టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద బుధవారం వాహనాల రద్దీ కొనసాగింది. గురువారం దసరా పండుగ కావడంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీ నెలకొంది. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఫాస్టాగ్ చిప్‌ను రెండు, మూడు సెకన్లలోనే స్కాన్ అయ్యేలా స్కానర్లను అప్‌డేట్ చేశారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నప్పటికీ టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు.
నేత్రపర్వంగా గజవాహన సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలో భాగంగా గజవాహన సేవ నేత్రపర్వంగా చేపట్టారు. బుధవారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ నిర్వహించారు.
అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన జరిపించారు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు