
మద్యం, మాంసం దుకాణాలు బంద్
దుకాణాలు తెరిస్తే జరిమానా
నల్లగొండ టూటౌన్: ఈ సారి దసరా (విజయదశమి) పండుగపై గాంధీ జయంతి ప్రభావం పడనుంది. తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి జరుపుకునే పెద్ద పండుగ దసరా. ఆడపడుచులు, కొత్త అల్లుళ్లతోపాటు దగ్గరి బంధువులను పిలిచి ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. తెలంగాణలో పండుగ ఏదైనా ముక్క, చుక్క ఉండాల్సిందే. ఈ సారి దసరా పండుగ రోజే జాతిపిత మాహాత్మాగాంధీ జయంతి రావడంతో ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేయాలని మున్సిపల్, ఎకై ్సజ్ శాఖల అధికారులు నోటీస్‌లు జారీచేశారు. దాంతో పండుగ పూట మందు, మాంసం, చికెన్ విక్రయాలు బంద్ కానున్నాయి. దీంతో పండుగ రోజు కొత్త అల్లుళ్లకు పప్పు, కూరగాయల వంటలతోనే సరిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని అందరూ చర్చించుకుంటున్నారు.
దుకాణాల మూసివేతకు నోటీసులు జారీ
మామూలు రోజుల్లోనే ముక్క, చుక్క లేనిదే ముద్దదిగదని మద్యం, మాంసం ప్రియులకు ఈ సారి దసరా కిక్కు లేకుండా పోసింది. ఆ రోజే గాంధీ జయంతి రావడంతో మాంసం, మధ్యం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటల్స్ మూసి వేయాలని మున్సిపల్ అధికారులు రెండు రోజుల ముందుగానే నోటీస్‌లు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో చుక్క, ముక్కకు ఎక్కడికి వెళ్లాలనే మీ మాంసలో ఉన్నారు జనం. అయితే దసరా పంగుడ రోజు కొన్ని వేల టన్నుల మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. గ్రామాల్లో యాట (మటన్) మాంసం లేని ఇల్లు ఉండదు. అలాగే మద్యం దుకాణాల్లో రోజంతా కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగే పండుగ ఇది. ఈ సారి దసరా పండుగ, గాంధీ జయంతి రెండు ఒకేరోజు రావడంతో భారీ ఎత్తున జరిగే మద్యం, మాంసం విక్రయాలపై ప్రభావం పడనుంది.
ఫ దసరా పండుగ రోజే గాంధీ జయంతి
రావడంతో విక్రయాలు నిలిపివేత
ఫ ఆయా దుకాణాలు మూసేయాలని ఎకై ్సజ్, మున్సిపల్ శాఖల ఆదేశాలు
ఫ ఇప్పటికే దుకాణదారులకు నోటీసులు జారీ
ఫ చుక్క, ముక్కపై జనంలో సందిగ్ధం
ఈ సారి దసరా పండుగ రోజు గాంధీ జయంతి వచ్చిన నేపథ్యంలో మాంసం, మద్యం దుకా ణాలు మూసివేయాలి. హోటల్స్, రెస్టారెంట్స్, మాంసం వ్యాపారులకు విక్రయాలు జరుపవద్దని నోటీసులు జారీ చేశాం. దుకాణాలు తెరిస్తే చర్యల్లో భాగంగా జరిమానా విధిస్తాం.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్