
నాణ్యమైన సేవలు అందిస్తాం
నల్లగొండ, రామగిరి(నల్లగొండ): బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఆ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పానగల్ రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడిన బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ టవర్లను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ప్రజలకు చవక, నమ్మదగిన సేవలను అందిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్ ముందంజలో ఉందని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్‌టీటీహెచ్ ప్యాకేజీలు రూ.299, రూ.399లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, టీవీ ఛానల్స్, ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎఫ్‌ఏ సత్యనారాయణ, ఏజీఎం సుబ్బారావు, శాంతికుమారి, రాములు, సురేందర్, వెంకన్న, నరేందర్, జీవన్‌కుమార్,
పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.