
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
దేవరకొండ : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోజూ నమోదయ్యే ఓపీ వివరాలు, సిబ్బంది పనితీరు వంటి వివరాలు ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని మాతాశిశు మరణాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ సుదర్శన్ ఉన్నారు.
సమయపాలన పాటించాలి
అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం చందంపేట మండలంలోని గాగిళ్లాపురం గ్రామంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి