నల్లగొండ : హిందువుల పండుగలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను ఆర్టీసీ నిలువు దోపిడీ చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేస్తోందన్నారు. ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల పాలిట కష్టాలు తెచ్చే ప్రభుత్వంగా మారిందన్నారు. నల్లగొండ కాంగ్రెస్ అడ్డా అని గొప్పలు చెప్పే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్వించారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేత గోలి మధుసూదన్‌రెడ్డి, పకీరు మోహన్‌రెడ్డి, మిర్యాల వెంకటేశం, బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, కిషన్, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.