
అకడమిక్ కౌన్సిలర్ల నియామనికి దరఖాస్తులు
నల్లగొండ : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకడమిక్ కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎన్జీ కాలేజీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అధ్యయన కేంద్రాల్లో వివిధ సబ్జెక్టుల్లో బోధించడానికి అనుభవం ఉండి పీజీలో 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు braou. online.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్టోబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సిబ్బంది సంక్షేమానికి కృషి : ఎస్పీ
నల్లగొండ : సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. వర్షాకాలం, చలికాలంలో హోం గార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఇబ్బంది పడకుండా వారికి ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్, కిట్ బ్యాగ్స్, జంగిల్ ప్యాచ్‌లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోం గార్డ్ ఆర్‌ఐ శ్రీను, అడ్మిన్ ఆర్‌ఐ సంతోష, ఆర్ ఎస్‌ఐలు కళ్యాణ్‌రాజ్, రాజీవ్ పాల్గొన్నారు.
యూరియా అధిక ధరలకు అమ్మొద్దు
తిప్పర్తి : రైతులకు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. తిప్పర్తి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీని మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రైతులకు సరిపడా యూరియా అందిస్తామని.. రైతులు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ సన్నిరాజు తదితరులు ఉన్నారు.
నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి
మర్రిగూడ, చండూరు : నర్సరీలను సిబ్బంది సక్రమంగా నిర్వహించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి, శివన్నగూడెం, చండూరు మండలంలోని దోనిపాముల వద్ద నర్సరీలను పరిశీలించారు. బ్లాక్ ప్లాంటేషన్‌ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నర్సరీలో మొక్కలు ఎండిపోయిన, పాడైపోయిన మొక్కలను వెంటనే తొలగించి కొత్త విత్తనాలు నాటి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం శివన్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీఓలు జయరాజు, శ్రీనివాస్, ఏపీఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అకడమిక్ కౌన్సిలర్ల నియామనికి దరఖాస్తులు

అకడమిక్ కౌన్సిలర్ల నియామనికి దరఖాస్తులు