
బధిర విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మిర్యాలగూడ : బధిర విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 126 మంది బధిర విద్యార్థులకు ప్రభుత్వం దివ్యాంగుల శాఖ ద్వారా మంజూరు చేసిన రూ.10లక్షల విలువైన స్మార్ట్‌ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో రాణించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, వెంకట్‌రెడ్డి, బాలయ్య, ప్రిన్సిపాల్ రేపాల శ్రీనివాస్, రామకృష్ణ, స్వామి, మధుకర్, బంటు వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్