
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సమర్థమైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీసీఆర్‌బీ డీఎస్పీ రవికుమార్, సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్