
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర, జిల్లా నూతన కార్యవర్గాలను మంగళవారం నల్లగొండలోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా యానం విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఇటికాల రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మేడే రామకృష్ణ, కోశాధికారిగా ఉడావత్ లచ్చిరామ్‌నాయక్, అసోసియేట్ అధ్యక్షులుగా బొడ్డు హుస్సేన్, జి.లింగయ్య, ఉపాధ్యక్షుడిగా ఆర్.కిషన్‌నాయక్‌ను ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఈసం రాంబాబు, ప్రధాన కార్యదర్శిగాజి. జగదీశ్వర్, చండూరు మండల అధ్యక్షుడిగా వేముల సైదులు, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొంపెల్లి భిక్షం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్వాయి వెంకటయ్య, జటావత్ చంద్రుడు నాయక్, వెంకటయ్య, నామ నాగయ్య, బోయ రాము, అయోధ్య, ఉపేందర్, కరుణాకర్, గోపాల్, యాదయ్య పాల్గొన్నారు.