
నర్సరీ పరిశీలన
నాంపల్లి : మండలంలోని తుంగపాడ్ గ్రామంలో నర్సరీని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. మొక్కలు మంచిగా ఉండడంతో నిర్వాహకులను అభినందించారు. గ్రామంలో రైతు మల్లయ్య మునగ తోటను పరిశీలించారు. సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో మార్కెటింగ్ సౌకర్యం ఉన్నందున రైతులు మునగ తోటలు ఎక్కువగా వేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం శోభారాణి, లింగయ్య, భాస్కర్, నాగయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల భద్రతకు చట్టం తేవాలి
నకిరేకల్ : న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి కోరారు. నకిరేకల్‌లో న్యాయవాది కొండ యాదగిరి కార్యాలయంలో బుధవారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ యాదగిరి, సీనియర్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, బచ్చుపల్లి ప్రకాష్‌రావు, ఎండీ హఫీజ్, మంగ సైదులు, నూక మల్లేష్, రాజు, గఫార్ తదితరులు పాల్గొన్నారు.

నర్సరీ పరిశీలన