
హాట్ కేకుల్లా హౌసింగ్ బోర్డు ప్లాట్లు
నల్లగొండ : నల్గగొండలోని దేవరకొండ రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీలోని హెచ్‌ఐజీ, ఎంఐజీ ప్లాట్లు మంచి ధర పలికాయి. మంగళవారం నిర్వహించిన వేలంలో 21 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.8,97,48,600 ఆదాయం వచ్చింది. పలు ప్లాట్లను నిర్ణయించిన ఆఫ్‌సెట్ ధర కంటే రెట్టింపు రేటుకు అమ్ముడయ్యాయి. హెచ్‌ఐజీ, ఎంఐజీకి చెందిన 27 ప్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. చదరపు గజానికి హెచ్‌ఐజీ ప్లాటుకు రూ.15 వేలు, ఎంఐజీ ప్లాటుకు రూ.13 వేలుగా ఆఫ్ సెట్ ధర నిర్ణయించింది. వేలంలో హెచ్‌ఐజీ ప్లాట్లు గరిష్టంగా రూ.28,500, ఎంఐజీ ప్లాట్లు రూ.23,500 వరకు ధర పలికాయి. కాలనీలో 4660 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించగా, ఒక్కో చదరపు గజానికి సగటున రూ.19,069 ధర పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫ నల్లగొండలో చదరపు గజం గరిష్టంగా రూ.28,500
ఫ 21 ప్లాట్ల అమ్మకంతో సుమారు రూ.8.97 కోట్ల ఆదాయం