
కదంతొక్కిన కార్మికలోకం
సాక్షి, నెట్‌వర్క్ : కార్మికుల హక్కులకు బంగం కలిగించేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బుధవారం విజయవంతమైంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ీబీఆర్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, బ్యాంకు, విద్యుత్, ఆర్టీసీ, ఎల్‌ఐసీ, రైల్వే తదితర ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సాగింది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించి ఎక్కడిక్కడ ర్యాలీలు, బహిరంగ సభలతో నిరసన తెలిపారు. లబర్ కోడ్‌ల వల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు కలుగుతుందని ట్రేడ్ యూనియన్లను, ఉద్యోగుల, కార్మికుల సంఘటిత శక్తిని బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పొట్టగొడుతు కార్పొరేట్లకు దోచి పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకునేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
● నల్లగొండలో నిర్వహించిన సమ్మెలో భాగంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, క్లాక్‌టవర్ వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ సమ్మెతో నైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు.
● దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మె సాగింది. ఆయా మండలాల్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
● మిర్యాలగూడ నియోజవర్గంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య పార్క్ నుంచి బస్టాండ్ రాజీవ్‌చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దామరచర్ల, మాడ్గులపల్లి మండల కేంద్రాల్లో అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిపై ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
● నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. మండల కేంద్రాల్లో కార్మికులు ర్యాలీలు చేపట్టారు. చిట్యాలలో పీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
● నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. హాలియాలో కార్మికులు రాస్తారోకో చేపట్టారు.
● మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కార్మిక, రైతులు సంఘాల ఆధ్వర్యంలో సమ్మెల సాగింది. మునుగోడులో రైతులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. చండూరు బస్టాండ్ ఎదుట కార్మిక సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు.
ఫ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం
ఫ నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని కార్మికుల డిమాండ్

కదంతొక్కిన కార్మికలోకం