
కుటుంబ పాలన అంతమొదించాలి
నల్లగొండ టూటౌన్ : చైతన్యానికి మారుపేరైన నల్లగొండ గడ్డపై కుటుంబ పాలనను అంతమొందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన రామచందర్‌రావకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, భార్యభర్తలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవుతూ కుటుంబపాలన నడిపిస్తున్నారని విమర్శించారు. ఈ జిల్లాలోనే సీఎం రేవంత్‌రెడ్డి రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారని, దళారుల ద్వారా రేషన్‌కార్డులు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పేరు చెప్పుతారే తప్ప ఇంతవరకు పూర్తి చేయలేదని, అందులో చిక్కుకున్న వారి జాడ కూడా కనిపెట్టలేకపోయారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర పోనియ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చింత సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, మాదగాని శ్రీనివాస్‌గౌడ్, బండారు ప్రసాద్, వీరెళ్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, పల్లెబోయిన శ్యాంసుందర్, పోతెపాక సాంబయ్య పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు