
డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి ఉత్తమ అవార్డు
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించడంతో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రసంసించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్‌రావు, రవీందర్రావు, సురేంద్రమోహన్, ఉదయభాస్కర్ ఉన్నారు.
17న జాబ్ మేళా
నల్లగొండ : నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, బయోడేటాతో జాబ్‌మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. అర్హత, వేతనం తదితర పూర్తి వివరాలకు 7893420435 ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
19న పాత వస్తువుల వేలం
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత వస్తువులను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు వేలం వేస్తున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో ఐరన్ లీడింగ్ చైన్లు, కార్పేట్లు, హెల్మెట్లు, పర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లను వేలం వేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు వివరాలకు వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ 8712670169 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిచేయాలి
నల్లగొండ : నిర్దేశించిన సమయంలో మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన ఎంపీడీఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనమహోత్సవం కింద గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, నర్సరీలను చేపట్టడం వంటి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛభారత్ కింద పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, వర్మి కంపోస్ట్ తయారీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ రజ్ కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు రాకపోతే
ఇంటికెళ్లి తీసుకొస్తారు
మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని దామెరబీనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయుడు కొండ శ్రీనివాస్.. బడికిరాని విద్యార్థుల ఇంటికి వెళ్లి బైక్ తీసుకొస్తారు. విద్యార్థులు గైర్హాజరైతే చాలు వారి ఇంటివెళ్లి రాకపోవడానికి కారణాలు ఏమిటో తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని స్వయంగా బైక్‌పై ఎక్కించుకొని వస్తుంటారు. ఈ పాఠశాలలో మొత్తం 89 మందివిద్యార్థులు ఉన్నారు. మంగళవారం ముగ్గురు బడికి రాకపోవడంతో హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయుడు ఇద్దరు కలిసి వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి బైక్‌పై తీసుకొచ్చారు. స్కూల్‌లో విద్యార్థుల హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా తనవంతు కృషి చేస్తున్నట్లు హెచ్‌ఎం తెలిపారు.

డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి ఉత్తమ అవార్డు

డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి ఉత్తమ అవార్డు