వడ్డీ వచ్చేసింది! | - | Sakshi
Sakshi News home page

వడ్డీ వచ్చేసింది!

Jul 18 2025 4:54 AM | Updated on Jul 18 2025 4:54 AM

వడ్డీ వచ్చేసింది!

వడ్డీ వచ్చేసింది!

మూడేళ్లుగా అందని వడ్డీ

మూడేళ్ల నుంచి మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు అందడం లేదు. తీసుకున్న రుణాన్ని బ్యాంకుల్లో సకాలంలో చెల్లించిన వెంటనే ప్రభుత్వం ఆ మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించాలి. కానీ మూడేళ్లుగా వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర పూర్తయింది. దీంతో ప్రభుత్వం వాటిని విడతల వారీగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని ఆయా సంఘాలకు రూ.38.63 కోట్లు విడుదల చేసింది. అయితే జిల్లాల్లో మహిళ సంఘాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికి సకాలంలో ఆయా రుణాలను వడ్డీతో సహా చెల్లించిన సంఘాలు 41 వేలకుపైగా ఉన్నాయి. ఆయా సంఘాలకు ఇప్పుడు వడ్డీ బకాయిలు అందనున్నాయి.

మూడేళ్ల తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ బకాయి విడుదల

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. మూడేళ్లుగా రుణాలు తీసుకొని అసలు, వడ్డీ సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళల సంఘాలకు రూ.38.63 కోట్లు విడుదల చేసింది. విడుదలైన వడ్డీ బకాయిల్లో నల్లగొండ జిల్లాలోని మహిళ సంఘాలకు రూ.20.80 కోట్లు, సూర్యాపేటకు 5.43 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.12.40 కోట్లు ఇచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ వడ్డీ బకాయిలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబురాల ముగింపు సమావేశంలో శుక్రవారం అందజేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆయా మహిళ సంఘాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

రుణాలు సక్రమంగా

చెల్లించిన సంఘాలకే..

ఉమ్మడి జిల్లాలో దాదాపు 70 వేల వరకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు, వారు చేసే వ్యాపారాలు ఇతరత్రా పనులకు పోత్సాహం అందించేందుకు ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. అయితే బ్యాంకులనుంచి రుణాలను తీసుకున్న సంఘాలు ఆ రుణాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా వడ్డీతో సహా బ్యాంకుల్లో చెల్లించాలి. అలా చెల్లించిన మహిళా సంఘాలకే ప్రభుత్వం ఆ వడ్డీని తిరిగి మహిళా సంఘాల ఖాతాలో జమ చేస్తుంది. ఇలా నల్లగొండ జిల్లాలో 19,390, సూర్యాపేటలో 10,603, యాదాద్రి జిల్లాలో 11,209 సంఘాలు సక్రమంగా రుణాలు చెల్లించాయి. ఆయా సంఘాలన్నింటికీ ప్రభుత్వం వడ్డీ బకాయిలను విడుదల చేసింది.

ఫ ఉమ్మడి జిల్లాకు రూ.38.63 కోట్లు కేటాయింపు

ఫ మహిళా సంఘాల హర్షం

ఫ ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పంపిణీ

వడ్డీ పంపిణీ వివరాలు ఇలా..

జిల్లా వడ్డీ పొందే వచ్చిన మొత్తం

సంఘాలు (రూ.కోట్లలో)

నల్లగొండ 19,390 20.80

సూర్యాపేట 10,603 5.43

యాదాద్రి 11,209 12.40

మొత్తం 41,202 38.63

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement