
భూ భారతి సమస్యలు పరిష్కరించాలి
చండూరు : భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీదేవితో సమావేశమయ్యారు. రేషన్‌కార్డుల పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. చెర్లగూడం రిజర్వాయర్ బాధితులు ఇటీవల పనులను నిలిపివేసిన విషయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏఓ పద్మ, డీటీ పరమేష్, ఇన్‌చార్జి తహసీల్దార్ నిర్మల, ఆర్‌ఐ ప్రసన్న ఉన్నారు.