
జలవిద్యుత్‌పై అధికారులకు దిశానిర్దేశం
నాగార్జునసాగర్: రాష్ట్రంలోని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టుల్లోని అన్ని యూనిట్లను వినియోగంలోకి తేవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నాగార్జునసాగర్ జెన్‌కో పవర్‌హౌస్‌లో.. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అధికారులు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆయా ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన సమయం ప్రకారం ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని, ఇందుకొక క్యాలండర్‌ను రూపొందించాలన్నారు. ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో దాని ప్రకారం ప్రతివారం సమీక్షించాలని చెప్పారు. సంవత్సర కాలంలోనే 2,000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరిగిందన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పవర్ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రపంచంలో వస్తున్న నూతన సాంకేతికతపై సిబ్బందికి అప్డేట్ అయ్యేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. జెన్‌కో సీఎండీ మొదలుకుని, కింది స్థాయి వరకు కొత్త టెక్నాలజీపై మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గడిచిన ఏడాది కాలంలో జెన్‌కో సిబ్బంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్ డౌన్లు, విద్యుత్ కోతలు లేవని, అందుకు ఆ శాఖలోని అధికారులు, సిబ్బందిని అభినందించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర జెన్‌కో సీఎండీ హరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నారాయణఅమిత్, హైడల్ డైరెక్టర్ పి.బాలరాజు, సీఈలు నారాయణ, మంగేష్‌కుమార్‌నాయక్, ఎస్‌ఈలు వెంకటరమణ, ఓఅండ్‌ఎండీ ఎస్‌ఈ రఘురాం, సివిల్ ఎస్‌ఈ డి.రామకృష్ణారెడ్డి, ఈఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు.
ఫ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయాలి
ఫ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచన
ఫ సాగర్ జెన్‌కో పవర్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష

జలవిద్యుత్‌పై అధికారులకు దిశానిర్దేశం