
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
హాలియా : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హాలియాలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు వివిధ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రవణ్‌కుమార్, డీపీఎంలు రామలింగయ్య, వీరయ్య, ఏపీఎంలు కళావతి, లలిత, అశోక్‌కుమార్, లక్ష్మీనారాయణ, నరసింహ, యాదయ్య, ఆర్‌ఎం శ్రీలేఖ, సీసీ నరసింహాచారి, సైదయ్య, యాదయ్య, తంగమణి, బాలునాయక్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
రెండు గంటల పాటు నిరీక్షణ
ఈ కార్యక్రమం అధికారికంగా మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి రావాల్సి ఉండగా సాగర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనకు వెళ్లారు. మరోపక్క జిల్లాస్థాయి ముఖ్య అధికారులు హాజరు కాలేదు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో ఫంక్షన్ హాల్‌లోకి వచ్చిన మహిళలు బయటకు వెళ్లకుండా కిందిస్థాయి అధికారులు గేటుకు తాళం వేశారు. దీంతో రెండు గంటల పాటు నిరీక్షించిన మహిళలు అసహనానికి గురై తాము వెళ్లిపోతామని అధికారులతో చెప్పడంతో కొందరిని బయటకు పంపారు. ఆ తరువాత జిల్లాస్థాయి అధికారులు రావడంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది.
ఫ డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి