
ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం
కేతేపల్లి: ప్రతి ఎకరాకు సాగు నీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. వానాకాలం పంటల సాగుకు గాను శుక్రవారం ఆయన కుడి కాల్వ ఆయకట్టుకు మూసీ ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉండడంతో వానాకాలంలో రైతులు వరినాట్లు వేసుకునేందుకు సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. కాల్వలకు వదిలిన నీరు వృథా కాకుండా చివరి ఆయకట్టు భూములకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు సీజన్లలో 60 వేల ఎకరాల భూములకు సాగు నీరందించే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, మూసీ ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌రెడ్డి, కేతేపల్లి తహీసీల్దార్ రమాదేవి, ఏఈలు మమత, స్వప్న, మధు, నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోట మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీ పి.శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్‌యాదవ్, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఫ మూసీ కుడి కాల్వకు నీటి విడుదల

ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం