
సృజనాత్మకత వెలికితీతకే ‘ఇన్‌స్పైర్ మనక్’
నల్లగొండ: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీసేందుకే ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో ఇన్‌స్పైర్ మనక్ అవార్డుల ఆన్‌లైన్ నామినేషన్‌పై సైన్స్ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల విద్యార్థుల నుంచి సేకరించిన 5 ప్రాజెక్టులను ఆగస్టు 6లోగా ఇన్‌స్పైర్ యాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఇన్‌స్పైర్ అవార్‌ుడ్స పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో నవమి ఫౌండేషన్ శ్రవణ్, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సైన్స్, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘చేనేత భరోసా’ ఇవ్వాలి
నల్లగొండ టౌన్ : జియోట్యాగింగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం కింద రుణాలు ఇవ్వాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గంజి నాగరాజు, దండెంపల్లి సత్తయ్య, కందగట్ల గణేష్, జెల్లా నర్సింహ, చెరుకు సైదులు, శ్రీరంగం, వనం గణేష్, ఏలె శ్రీనివాస్, గంజి రాజేష్, రాపోలు వెంకన్న, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
రోస్టర్ పాయింట్లు, ప్రమోషన్లు వేర్వేరుగా ఉండాలి
నల్లగొండ టౌన్ : రోస్టర్ పాయింట్లు, ప్రమోషన్లు వేర్వేరుగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్‌లపై ఎస్సీ ఉద్యోగులు అందరూ సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదట రాష్ట్ర అడహక్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న శంకర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యక్షులు స్వామి, నందిగామ సైదులు, అసోసియేట్ అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శి కిరణ్, జాయింట్ సెక్రటరీ నీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ బెనర్జీ, కోశాధికారి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
22న ఎన్జీ కళాశాల
వ్యవస్థాపక దినోత్సవం
రామగిరి(నల్లగొండ): ఈ నెల 22న ఎన్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కళాశాలలో విద్యనభ్యసించి అనేకమంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడినట్లు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

సృజనాత్మకత వెలికితీతకే ‘ఇన్‌స్పైర్ మనక్’

సృజనాత్మకత వెలికితీతకే ‘ఇన్‌స్పైర్ మనక్’

సృజనాత్మకత వెలికితీతకే ‘ఇన్‌స్పైర్ మనక్’