
మైనార్టీలకు కాంగ్రెస్ పెద్దపీట
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ అన్నారు. మతాల పేరుతో, కులాల పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందని, పదేళ్లు పేదలకు బీఆర్‌ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. మంగళవారం నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు దర్గా ఘాట్ రోడ్డుకు నిధులు మంజూరు చేశారని, దీనిపై ఇతర పార్టీలు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తుందని, హఫీజ్‌ఖాన్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ మధ్య కొంతమంది మతం, కులం పేరుతో గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఏ సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఘాట్‌రోడ్డుపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ వర్గాల్లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీని గెలిపించుకున్నామని, అందుకే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా నూతనంగా నియామకమైన హఫీజ్‌ఖాన్, నాయకులు డాక్టర్ ఎ.ఎ.ఖాన్, ఇంతియాజ్ హుస్సేన్, జూకూరి రమేష్, వంగూరి లక్ష్మయ్య, సమద్, ఇంతియాజ్ అలీ, అమేర్, ఇబ్రహీం, అజ్జు తదితరులు పాల్గొన్నారు.
ఫ దుర్గా ఘాట్‌రోడ్డుపై
రాజకీయాలు సరికాదు
ఫ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు
శంకర్‌నాయక్