
పనుల్లో అలసత్వంపై ఆగ్రహం
చండూరు : భవిత కేంద్రం పనుల్లో అలసత్వంపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న భవిత కేంద్రం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు పనులు పూర్తిచేయకపోవడంపై ఎంఈఓ, సంబంధిత అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయకపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. నాలుగు రోజుల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీదేవి, ఎంఈఓ సుధాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్ నిర్మల తదితరులు ఉన్నారు.
బాలగేయాలతో పిల్లలకు మనోవికాసం
కనగల్ : పిల్లల మనోవికాసానికి బాలగేయాలు దోహదపడతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ‘ఊగుతున్న ఉయ్యాల’ బాలగేయాలను సోమవారం ఆయన పీఆర్‌టీయూ భవన్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి గ్రంథాలయంలో ఇటువంటి పుస్తకాలు ఉంటే విద్యార్థులు అభ్యసనంపై శ్రద్ధ చూపుతారని అన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్‌రావు, కాలం నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, కళావతి, యూసుఫ్ పాషా, సైదిరెడ్డి, నామిరెడ్డి వెంకటరెడ్డి, మురళి, వీరమల్ల శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా హఫీజ్‌ఖాన్
రామగిరి(నల్లగొండ ): నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డాక్టర్ ఎండీ.అబ్దుల్ హఫీజ్‌ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హఫీజ్‌ఖాన్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనేక పదవులు చేపట్టారు. 1994 నుంచి 1996 వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వక్ఫ్‌బోర్డ్ చైర్మన్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేసి డిజటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తానన్నారు. గ్రంథాలయాల్లో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు మెరుగైన ఫలితాలు సాధించేంలా వసతులు కల్పిస్తానన్నారు.
శివన్నగూడెం రిజర్వాయర్ పనుల అడ్డగింత
మర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ పనులను చర్లగూడెం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. అనంతరం రిజర్వాయర్ మెయిన్ క్యాంపు ఎదురుగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం, ప్యాకేజీ అందించి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూనిర్వాసితులు, మహిళలు రాత్రి సమయంలో దీక్షను కొనసాగించి బస చేశారు. విషయం తెలుసుకున్న రిజర్వాయర్ ఈఈ రాములునాయక్ నిర్వాసితులతో మాట్లాడుతూ విషయాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా కల్పించినప్పటికీ న్యాయం జరిగేంతవరకు దీక్షను విరమించమని భీష్మించారు. కార్యక్రమంలో వల్లపు కేశవులు, ఎరుకల నిరంజన్, కుంచపు కొండయ్య, రాంకోటి, సైదులు, ఎల్లయ్య, సుగుణమ్మ, సత్యనారాయణ, గంగమ్మ తదితరులు ఉన్నారు.

పనుల్లో అలసత్వంపై ఆగ్రహం

పనుల్లో అలసత్వంపై ఆగ్రహం

పనుల్లో అలసత్వంపై ఆగ్రహం