
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మధుబాబు
నల్లగొండ టూటౌన్ : వరంగల్‌లో పని చేస్తున్న ప్రొపెసర్ డాక్టర్ సిహెచ్.మధుబాబును పదోన్నతిపై నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు సూర్యాపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ జె.సత్యనారాయణను నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్ రాజలింగంను జనగాం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పి.శ్రవణ్‌కుమార్‌ను సూర్యాపేట జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొపెసర్ రాజ్యలక్ష్మిని వికారబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, యాదాద్రి భువనగిరిలోని మెడికల్ కాలేజీలో పని చేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ పి.మాలతిని కొడంగల్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. యాదాద్రి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసున్న వెంకటేశ్వర్లును జె.భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న ఈఎన్‌టీ డాక్టర్ శంకర్‌ను ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
మునుగోడు : పంచాయతీ ఉద్యోగులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహింస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మునుగోడు మండలంలోని సొలిపురం గ్రామాని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మునుగోడులోని బీసీ గురుకులానికి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయభాస్కర్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నేటి సమ్మెను
విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో మంగళవారం మగ్దూం బవన్‌లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈ నెల 15న దేవరకొండలో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, వెంకట రమణ, బంటు వెంకటేశ్వర్లు, నరసింహ, రామచంద్రం, రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, ఉజ్జిని యాదగిరిరావు పాల్గొన్నారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మధుబాబు