
సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలి
నల్లగొండ : ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ వేదిక అని.. కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్వించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు చేసి ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజల సమస్యలపై అవగాహన ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కోటి, వినాయక రాజు, కార్తీక్, నాగరాజు, పాదం అనిల్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు
కేతావత్ శంకర్‌నాయక్