
ఫొటో తీసి.. పౌష్టికాహారం ఇచ్చి
మిర్యాలగూడ టౌన్ : అంగన్‌వాడీ కేంద్రాల సేవల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. లబ్ధిదారులకు సరుకులను ఇచ్చేందుకు ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేస్తోంది. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం, ఇతర సేవలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేసేవారు. గుడ్లు, బాలామృతం, ఇతర పోషకాహార పదార్థాలు సరిగా అందడం లేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని లబ్ధిదారుల నుంచి ఆరోపణలున్నాయి. దీంతో సేవల్లో పాదర్శకత ఉండేలా ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో జూలై 1వ తేదీ నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు గతంలో అందించిన ‘పోషణ ట్రాక్టర్’ యాప్ ద్వారా ఫేస్ రికగ్నెషన్ హాజరు తీసుకుంటున్నారు.
మొదటగా మూడేళ్లలోపు చిన్నారులు..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఫేస్ రికగ్నేషన్ విధానం మొదటగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు అమలు చేయనున్నారు. ‘పోషణ ట్రాక్టర్’ యాప్‌లో చిన్నారి లేదా.. తల్లిని ఫొటోను తీసి అప్‌లోడ్ చేయనున్నారు. మొదటగా ఆధార్ వివరాలను సమర్పిస్తారు. ఫొటోను యాప్‌లో నమోదు చేసిన తర్వాత ఆధార్‌కు అనుసంధానం అయిన ఫోన్ నంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. దీన్ని యాప్‌లో నమోదు చేయడం ద్వారా ధ్రువీకరణ పూర్తి అవుతుంది. దీంతో ఆయా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తారు. లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాలను మొదటి నెలలో నమోదు చేస్తారు. ఆ తరువాత ప్రతి నెలా పౌష్టికాహారం అందించే సమయంలో ఫొటోలు తీసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత మూడేళ్లు దాటిన చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను యాప్‌లో నమోదు చేసి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల్లో
ఫేస్ రికగ్నేషన్ విధానం
ఫ పౌష్టికాహారం పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా అమలు
జిల్లాలోని కేంద్రాలు,
లబ్ధిదారుల వివరాలు
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 9
అంగన్‌వాడీ కేంద్రాలు 2093
చిన్నారులు 76494
గర్భిణులు 8538
బాలింతలు 6595
పకడ్బందీగా అమలు చేస్తాం
అంగన్‌వాడీల్లో జూలై 1వ తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్)లో నమోదు చేశాకే లబ్ధిదారులకు సరుకులు అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. పోషణ ట్రాకర్ యాప్‌లో చిన్నారి లేదా తల్లి ఫొటోను తీసుకుని సరుకులు ఇస్తాం.
– కృష్ణవేణి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖాధికారి, నల్లగొండ

ఫొటో తీసి.. పౌష్టికాహారం ఇచ్చి