
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ వసతిగృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హాస్టల్ విద్యార్థులకు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఇప్పటివరకు మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు, బట్టలు, దుప్పట్లు వెంటనే ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. సమావేశంలో ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, కుర్ర సైదానాయక్, కోరే రమేష్, కుంచం కావ్య, స్పందన, రవీందర్, బుడిగ వెంకటేష్, మారుపాక కిరణ్, ఎంఏ సైఫ్, జగన్, జగదీష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.