
మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి
నాంపల్లి : మహిళలు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ భవానితో మాట్లాడారు. గత నెల ఎన్ని కాన్పులు చేశారని కలెక్టర్ ప్రశ్నించగా రెండు కాన్పులు చేసినట్లు భవాని తెలిపారు. రోగులకు ఆరోగ్య విద్యపై నిర్వహించిన అవగాహన సదస్సుకు రోగులు, కుటుంబ సభ్యులు హాజరు కావడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేయించి మొక్కలు నాటించినందుకు సిబ్బందిని అభినందించారు. అంతకుముందు కలెక్టర్ కేజీబీవీనీ సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్, ఇతర సమస్యలను కలెక్టర్ దృష్టికి సిబ్బంది తీసుకురాగా వెంటనే నివేదిక పంపించాలని ఎంపీడీఓ శ్రీనివాసశర్మను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తులన్నింటిని ఆగస్టు 14వ తేదీలోగా పరిష్కరించాలని తహసీల్దార్ జి.దేవసింగ్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, ఎంపీఓ ఝాన్సీ, ఆర్‌ఐ విజయ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి