
స్కూల్కు నడుచుకుంటూ వెళ్లే వాడిని
మాడ్గులపల్లి: మాది చిరుమర్తి గ్రామం. నేను మా గ్రామం నుంచి ఆగామోత్కూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు రోజూ టిఫిన్ బాక్స్ పట్టుకోని నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఆ పాఠశాల నిజాం కాలం నాడు కట్టించింది. ఆ పాఠశాలలో నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. పదో తరగతి వార్షిక పరీక్షలో నేను మండల ఫస్ట్ ర్యాంకు సాధించాను. పాఠశాలలో నా స్నేహితులతో కలిసి బాగా ఆడుకునేవాడిని. ఆగామోత్కూర్ పాఠశాలలో చదువుకున్న వారు నేడు ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా టీచర్లు, ఎంఈఓలు, విద్యా శాఖ డైరెక్టర్లు కూడా అయ్యారు.
ఫ ఎన్.శంకర్, సినీ డైరెక్టర్