డిండి : పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశించారు. శనివారం డిండి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శ్రీమీట్ యువర్ ఎస్పీశ్రీ కార్యక్రమానికి హాజరైన ఆయన పలువురు ఫిర్యాదుదారులతో మాట్లాడారు. సమస్యలను చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి రావడానికి ఇబ్బంది పడే వారితో నేరుగా మాట్లాడేందుకే మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ తెలిపారు. ల్యాండ్, ఫ్మామిలీ, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చేసే మోసాలు తదితర అంశాలపై వచ్చిన 23 ఫిర్యాదులను వారం రోజుల్లోపు పరిష్కరించాలని డిండి రూరల్ సీఐ సురేష్, ఎస్‌ఐ రాజుకు ఎస్పీ సూచించారు. అంతకు ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నెలకొన్న సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఉన్నారు.
ఎస్పీ శరత్‌చంద్ర పవార్