ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

కల్వకుర్తి రూరల్‌: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేపట్టడంతోపాటు అనుక్షణం నిఘా ఉంచాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తిలో ఓటరు నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు అన్ని నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కల్వకుర్తిలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పట్టపద్రుల ఓటు నమోదును పక్కాగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని వార్డులు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. గతంలో ఓటు నమోదు చేసుకున్నవారు మరోసారి నమోదు చేసుకోవాలని, పార్టీ సానుభూతిపరులు ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటరు నమోదు చేసుకున్న వారితో మాట్లాడారు. పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపులు తదితర మార్గాల ద్వారా పెద్దఎత్తున ప్రచారం చేయాలన్నారు. యువత, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులు, ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్న వారిని సంప్రదించి ఓటరుగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దశరథ నాయక్‌, రాంరెడ్డి, విజయ్‌గౌడ్‌, ఐజాక్‌, షాహేద్‌, రాముడునాయక్‌, ప్రదీప్‌, నాగులునాయక్‌, యాదగిరిరెడ్డి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement