మట్టి పరీక్ష కేంద్రం భవనాన్ని పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

మట్టి పరీక్ష కేంద్రం భవనాన్ని పూర్తిచేయాలి

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

కందనూలు: మట్టి పరీక్ష కేంద్ర భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమీపంలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన మట్టి పరీక్ష కేంద్ర భవనాన్ని కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతి, ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసార పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. మట్టి పరీక్ష కేంద్రానికి సంబంధించి మిగిలిన పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ పనులకు అవసరమైన నిధులను త్వరగా విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. భవనంలో అవసరమైన మరమ్మతు గుర్తించి, వాటికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ మట్టి పరీక్ష కేంద్రానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏఓ యశ్వంత్‌రావు, ఆర్‌అండ్‌బీ అధికారి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement