నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని ఉయ్యాలవాడ శివారులో సర్వేనం. 174, 177, 178, 179, 158లలో కొన్నెళ్ల క్రితం వెంచర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని కొంత భాగంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టన్నెల్ నిర్మిస్తున్నారు. మిగిలిన భాగంలో ఇంకా ప్లాట్లు ఉన్నాయి. వాటిలో ఇళ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. లేనిచో మా ప్లాట్లకు నష్టపరిహారమైనా చెల్లించాలి. – పాలమూరు ఎత్తిపోతల టన్నెల్
బాధితుల సంఘం, నాగర్‌కర్నూల్
నష్టపరిహారం చెల్లించండి..
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని ఉయ్యాలవాడ శివారులో మెడికల్ కళాశాల నిర్మాణానికి సర్వేనం. 237/3/ఎ1, 237/5/2లో 2.20 ఎకరాలకు గాను 1.20 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. అందుకు నష్టపరిహారం చెల్లించకపోగా.. ఎకరా భూమిని భూ భారతి పోర్టల్‌లో చూపించడం లేదు. దీనిపై 2025 అక్టోబర్‌లో హైకోర్టును ఆశ్రయించగా.. 2023 భూసేకరణ చట్టం ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు అధికారులు నష్టపరిహారం చెల్లించలేదు. మాకు న్యాయం చేయాలి. – కాకునూరు మధు,
ఉయ్యాలవాడ, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ
●


