సమస్యలు ఆలకించి.. భరోసానిచ్చి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు ఆలకించి.. భరోసానిచ్చి

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

● ప్రజావాణికి 54 అర్జీలు

● సత్వర పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశాలు

కందనూలు: ప్రజావాణిలో అందించే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర చర్యలు చేపట్టి.. బాధితులకు భరోసానిచ్చేలా చొరవ చూపాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 54 అర్జీలు అందగా.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రోజు ఎంత మంది నమోదు చేసుకుంటున్నారని ఆరా తీశారు. ప్రతి ఉద్యోగి, అధికారి సమయపాలన పాటించాలని.. లేనిచో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య, డీఆర్వో పాండు, ఏఓ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement